Sep 03,2023 21:18

కడప డిఎస్‌పి మహ్మద్‌ షరీఫ్‌

కడప ప్రతినిధి : నేరాల అదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నేరాల మూ లాలపై దృష్టి సారించాం. ఇందులోభాగంగా భూకబ్జాలు మొదలు కుని దొంగతనాలు, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ వంటి చర్యలు తీసుకో వడమైంది. ఇటువంటి ముందస్తు చర్యల కారణంగా క్రైమ్‌ రేషియో తగ్గుముఖం పట్టింది. మరింతగా నేరాలను అదుపు చేయడమే ధ్యే యంగా ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా సిసి కెమెరాల ఏర్పా టు దగ్గర నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వంటి సాంకేతిక సేవలు ఉపయో గించు కుంటున్నామని పేర్కొంటున్న కడప డిఎస్‌పి మహ్మద్‌ షరీప్‌ తో ప్రజాశక్తి ముఖాముఖి...
ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
కడపలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు కీలకమైన రహదారుల విస్తరణ కార్యక్రమం కొనసాగుతోంది. వాహన పార్కింగ్‌ ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, సిగల్‌ పాయింట్స్‌ యాక్టివేట్‌ చేయడం, బారీకేడ్స్‌ ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తల్తెకుండా చర్యలు తీసుకోవడమైంది. మున్సి పల్‌ కార్పొరేషన్‌తో కలిసి రూ.15 లక్షల విలువ కలిగిన సామగ్రిని కొనుగోలు చేయడంపై దృష్టి సారించడమైంది.
కడప డివిజన్‌ పరిధిలోని పిఎస్‌లు, సిఎస్‌ స్టేషన్లు ఎన్ని?
కడప డివిజన్‌ పరిధిలో 13 పోలీస్‌స్టేషన్లున్నాయి. కడపలో మూడు, ఒంటిమిట్ట, సిద్ధవటం, చింతకొమ్మదిన్నె, కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, ఖాజీపేట, సర్కిల్‌ ఇన్‌స్పెస్టర్‌ కార్యాలయాలు ఒంటిమిట్ట, కడపలో రెండు, కమలాపురం ప్రాంతాల్లో ఉన్నాయి.
నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలేమిటి?
నేర మూలాలపై దృష్టి సారించడమైంది. ఇందులో పోలీస్‌ స్టేషన్ల వారీగా భూక బ్జాలు మొదలుకుని దొంగతనాలు, అల్లర్ల నివా రణకు చర్యలు తీసుకోవడమైంది. ఫలితంగా కడప డివిజన్‌ పరిధిలో నేరాల అదుపు చేయడంలో కొంతమేరకు సఫలీకృతమయ్యామని చెప్పవచ్చు.
ఎల్‌హెచ్‌ఎల్‌ఎస్‌ సేవల గురించి తెలపండి?
కడపలో ఎల్‌హెచ్‌ఎల్‌ఎస్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు సంబంధిత ఇంటికి సిసి కెమెరాల ఏర్పాటు చేసి ఇళ్లు సహా దాని పరిసరాలను తమ సర్వేలెన్స్‌ పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. ఫలితంగా సంబంధిత ఇంటి పరిధిలోనికి ఎటువంటి అనుమానితులు వచ్చినా పోలీసులు అప్రమత్తం కావడం ద్వారా ఎటువంటి చోరీ ఘటనలు పునరావృతం గాకుండా చూసుకోగలుతున్నాం.
శాంతిభద్రతల నివారణకు తీసుకుంటున్న చర్యలేవి?
తమ పరిధిలో శాంతిభద్రతల నివారణపై చర్యలు తీసుకో వడమైంది. కడప నగరంలోని నేరాలకు ఆస్కారమిచ్చే స్లమ్‌ఏరియా లపై దృష్టి సారించాం. ఇందులోభాగంగా బ్లూకోల్ట్స్‌ సేవలు విస్తృతిని పెంచాం. ఇందులోభాగంగా బ్లూకోల్డ్స్‌, రక్షక్‌ పోలీసుల సేవలను ఉపయోగించుకుంటున్నాం. రోజుకు మూడు షిఫ్టులుగా విభజించడ మైంది. రాత్రి, పగలనే తేడా లేకుండా పోలీసులు గస్తీని ముమ్మరం చేయడమైంది.ట్రాఫిక్‌ క్రమబద్దీకరణపై దృష్టి