ప్రజాశక్తి-కోటవురట్ల:నేను ఎక్కడికి పోనూ ఇక్కడే ఉంటా అడ్డరోడ్డు దగ్గరే ఉంటా!, కార్యకర్తలకి నిరంతరం అందుబాటులోనే ఉంటానంటూ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పునరుద్ఘాటించారు. బుధవారం కైలాస పట్నం గ్రామంలో జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఇంటి వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు ఆయన చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు హాజరు కాకపోవడం పట్ల మండల వ్యాప్తంగా చర్చ కూడా కొనసాగింది. ఇదిలా ఉండగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు పై అధిష్టానం నుండి స్పష్టమైన హామీ లేక పోవడంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం వెంకటాపురం, కొడవటిపూడి, చౌడువాడ , లింగాపురం, ఎండపల్లి, కైలాస పట్నం, కోటవురట్ల గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..










