Nov 22,2021 12:27

తేదీలతో నిమిత్తం లేదు
కాలం ఎప్పటికీ గాయాల నదే
ముట్టుకుంటే చాలు రక్తపు మరకలే !

అమ్మడాలు నీకు
ఎనిమిదో వ్యసనమన్నావా
నీ దేశభక్తికి లిట్మస్‌ టెస్టే!

ఉచిత వ్యాక్సినేషన్‌ సంబరం
చొక్కా విప్పేంత వరకే
మళ్లీ చూసుకుంటే
వీపంతా పెట్రో వాతలే!

ఉచితాలన్నీ అనుచితాలే
పావురాలకు నూకలు జల్లినట్లు జల్లి
మనిషిని మాయం చేస్తారు!

ఏదీ నీ గాయమంటే
ఎక్కడని చూపను?
నేనే నడుస్తున్న పచ్చి గాయాన్ని!!
 

కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261