Nov 06,2023 00:04

ప్రజాశక్తి-తాళ్లరేవు రెండు రోజులుగా కురుస్తున్న జల్లులకు మండలంలోని లోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నేలకొరిగాయి. వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో పి.మల్లవరం పంచాయతీ, పోలేకుర్రు, లచ్చిపాలెం పరిధిలో నేలకొరిగిన పంట పొలాల మధ్య బాటలు వేసి వర్షపు నీరు బయటకు పోయేలా రైతాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సకాలంలో వర్షాలు రాక ఇబ్బందులు పడ్డ రైతాంగం వరి కోతలు దగ్గర పడే సమయంలో వర్షాలు రావడంతో ఆందోళనకు గురవుతున్నారు.