నేలకొరిగిన వృక్షం
ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలోని వెంకన్న బావి ప్రాంతంలో భారీ వృక్షం నేలకొరిగింది. నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతమైనప్పటికీ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధాన రోడ్డు కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి భారీ వృక్షాన్ని తొలగించాలని ప్రజలు శుక్రవారం కోరారు.










