Jul 13,2023 18:23

వైసిపి గ్రాఫ్‌ పెరిగింది..!

ప్రజాశక్తి -రాపూరులి :నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కారణంగా జిల్లాలో వైసిపి గ్రాఫ్‌ పెరిగిందని ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాపూరు తెలుగుగంగ అతిథి గహంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలవైసిపి నాయకులు, కార్యకర్తలతో ఎంఎల్‌సి మేరిగ మురళీధర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈనెల 21వ తేదీన వెంకటగిరిలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.వైసిపికి గ్రాఫ్‌ పెరిగిందే కానీ.. ఎక్కడా తగ్గలేదన్నారు.వెంకటగిరి నియోజవర్గంలో లోకేష్‌ ఏడు రోజులు పాదయాత్ర చేస్తే ఏడు మంది కార్యకర్తలు కూడా టిడిపిలో చేరలేదన్నారు .వెంకటగిరి నియోజవర్గానికి ఎంఎల్‌ఎగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్‌ పాదయాత్ర లో టీడీపీలో చేరాలని రాత్రులు 11 గంటల సమయంలో నాయకులకు ఫోన్లు చేసి చేసి మభ్యపెట్టినప్పటికి ఎవ్వరు పార్టీని విడిచిపెట్టి పోలేదన్నారు.