నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సోదరుడు మృతి
నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సోదరుడు మృతి
ప్రజాశక్తి -వాకాడు: మాజీ ఎఐసిసి సభ్యుడు, వైసీపీ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురు మల్లి జనార్థన్‌్ రెడ్డి అన్నయ్య డాక్టర్ నేదురుమల్లి పద్మనాభ రెడ్డి(93) బుధవారం మధ్యాహ్నం వాకాడు లోని అయన స్వగహం లో మతి చెందారు. పద్మనాభ రెడ్డి మతి విషయం తెలుసుకొన్న ప్రముఖులు, వైసీపీ నాయుకులు, వాకాడుకు చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అయన కాంగ్రెస్ లో ఏఐసిసి సభ్యులు గా సుదీర్ఘకాలం కొనసాగారు. కాంగ్రెస్ ని వీడి వై ఎస్ జగన్ తో కలిసి ప్రయాణం చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో వై ఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో పోరాటాలు చేశారు.










