Oct 31,2023 00:17

సమావేశంలో టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం అరండల్‌పేటలోని జిల్లా టిడిపి కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంపై ముందస్తు చర్చలు టిడిపి జిల్లా కార్యాలయంలో జరిగాయి. టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వివిధ అంశాలపై చర్చించారు. ఉమ్మడి కార్యచరణ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తదితర అంశాలపై మంగళవారం సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో పొత్తు అంశాల కంటే ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలనే అంశంపైనే చర్చించాలని తలపెట్టారు. సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, టిడిపి నాయకులు దాసరి రాజామాస్టారు, కంచర్ల శివరామయ్య, ఒంకార్‌ పాల్గొన్నారు.