Aug 10,2023 22:10

మంత్రితో మాట్లాడుతున్న మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని ఈనెల 11వ తేదీన అమలు చేయనుందని మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సున్నా వడ్డీ కార్యక్రమం ప్రారంభానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ నాలుగో విడతలో జిల్లాకు సంబంధించిన నాలుగు మున్సిపాల్టీల్లో సున్నా వడ్డీ కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.29.27 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఆయనతో పాటు బి.ఎల్‌ వెంకటరావు, ఎల్‌.హెచ్‌.బి భాస్కర్‌, సిఎంఎం మోహన్‌ తదితరులున్నారు.