
* శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస: ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణంలో నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. పట్టణంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక సాధికార విప్లవం నడుస్తుందన్నారు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏకమై సామాజిక సాధికార విజయ శంఖారావం పూరించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా పట్టణ శివారున ఫ్లై ఓవర్ వద్ద ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పిస్తామని అన్నారు. అక్కడ నుంచి ర్యాలీగా వచ్చిన ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పిస్తామని తెలిపారు. ప్రధాన రహదారి నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని అశేష జనవాహిని మధ్య మంత్రులు ప్రసంగిస్తారని అన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, మాజీ పట్టణ యువజన అధ్యక్షుడు ముత్తా విజరు, సనపల మోహన్‌కుమార్ పాల్గొన్నారు.