Sep 21,2023 21:29

యుటిఎఫ్‌ ప్రచారజాతా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు విజయవాడలో సిద్ధార్థ ఇం/తీనీరింగ్‌ కాలేజీలో అక్టోబర్‌ 1న జరగనున్నాయి. యుటిఎఫ్‌ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సెప్టెంబర్‌ 21 నుండి 29 వరకు ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు, హిందూపురం నుంచి విజయవాడ వరకు రెండు ప్రచార జాతాలు అన్ని జిల్లాలలో ముఖ్య పట్టణాలను కలుపుకొని పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఈనెల 22న బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, 23న కొత్తవలసలో జరిగే బహిరంగ సభలను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఆర్‌సి పట్నాయక్‌, జెఎవిఅర్‌ కె ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్‌ రావు, సిహెచ్‌ తిరుపతి నాయుడు, జి.రాజారావు, సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ పి.రాంప్రసాద్‌, పి.రామకృష్ణ, జి. రమణ, ఎస్‌ వెంకటరావు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.