Dec 01,2022 23:46

మాట్లాడుతున్న ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-కరాస : ఎన్‌ఎస్‌టిఎల్‌, ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యాన ఎన్‌ఎస్‌టిఎల్‌లో ఈనెల 2, 3 తేదీల్లో 'కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ మారిటైమ్‌ టెక్నాలజీ' థీమ్‌ మెరైన్‌ ఇంజనీర్స్‌ రెండు రోజుల 34వ నేషనల్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజనీర్స్‌ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్లు వై.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు రోజుల సదస్సులో డిజిటల్‌ టెక్నాలజీ ప్రభావం, గ్రీన్‌ మెరైన్‌ ఎన్విరాన్మెంట్‌, అటానమస్‌ వెహికల్స్‌, ఆల్టర్నేటివ్‌ మెటీరియల్స్‌, హైడ్రోడైనమిక్‌ డిజైన్లు, రెన్యూవబుల్‌ ఎనర్జీ , డీప్‌ ఓషన్‌ ఎక్స్ప్లోరేషన్‌ వంటి సముద్ర రంగంలో తాజా పరిణామాలపై వత్తిపరమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇది వేదిక కానుందని తెలిపారు. కోల్‌కతాలోని ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ అభ్యర్థన మేరకు ఎన్‌ఎస్‌టిఎల్‌లో నిర్వహించనున్న జాతీయ సదస్సులో ఎన్‌ఎస్‌టిఎల్‌ హైడ్రోడైనమిక్‌ డిజైన్‌, నౌకల నమూనా పరీక్ష యుద్ధనౌక అభివద్ధిలో బీ స్టీల్త్‌, ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ వంటి సాంకేతికతలు, సైనిక, పౌర అనువర్తనాల అవసరాలను తీర్చడానికి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా అవసరమైన పర్యావరణ వ్యవస్థ స్థాపనకు పరిశోధకులు, భారతీయ పరిశ్రమలు, విద్యావేత్తలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో 30 సాంకేతిక పత్రాలను సమర్పిస్తారన్నారు.. కిమ్స్‌ ఫౌండేషన్‌ రీసెర్చ్‌సెంటర్‌ చైర్మన్‌ డాక్టర్‌ వి. భుజంగరావు, డిఫెన్స్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సిపి రామనారాయణన్‌ ఎన్‌ఐఒటి చెన్నై డైరెక్టర్‌ డాక్టర్‌ జిఎ రామదాస్‌,. వైస్‌ అడ్మిరల్‌ శ్రీకుమార్‌ నాయర్‌ అతిథులుగా పాల్గొంటారన్నారు. మీడియా సమావేశంలో విశాఖపట్నం లోకల్‌ సెంటర్‌ అండ్‌ సిడిఆర్‌ చైర్మన్‌ పివిఎస్‌.గణేష్‌కుమార్‌, ఎంఆర్‌డిబి, ఐఇఐ చైర్మన్‌ డాక్టర్‌ భాస్కర్‌ ఎం.భండార్కర్‌ పాల్గొన్నారు.