
ప్రజాశక్తి - రేపల్లె
జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని సీతా రామ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆర్‌డిఒ హేల షారోన్ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజక హెడ్ క్వార్టర్‌లో స్పందన కార్యక్రమం ఏర్పా చేసినట్లు చెప్పారు. మండలంలోని ప్రజలు జిల్లా కేంద్రాల వరకు వెళ్లకుండా ప్రభుత్వం అధికారులనే మండలాలకు వచ్చే విధంగా ఈ కార్యక్రామాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. స్పందనలో కలెక్టర్‌తో పాటు అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలుంటే కలెక్టర్ సమక్షంలో అర్జీలు అందజేయాలని సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.