Nov 05,2023 00:13

నేడు ప్రజా రక్షణ భేరి బస్సుయాత్రను జయప్రదం చేయండి: సిపిఎం


నేడు ప్రజా రక్షణ భేరి బస్సుయాత్రను జయప్రదం చేయండి: సిపిఎం


ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : అసమానతలు లేని పారదర్శక, స్పష్టమైన అభివద్ధి కోసం సీపీఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్రను జయప్రదం చేయాలని సీపీఎం సెంట్రల్‌ శాఖా కార్యదర్శి జోగి శివకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గూడూరు పట్టణం లోని పాత బస్టాండ్‌, పోస్ట్‌ ఆఫీస్‌ , ట్రెజరీ, మండల కార్యాలయం, గాంధీ మున్సిపల్‌ బిల్డింగ్‌, టెలిఫోన్‌ ఆఫీస్‌ , ప్రధాన కూడళ్లలో ప్రజా రక్షణ భేరి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోగి శివ కుమార్‌ మాట్లడుతూ ఈ బస్సు యాత్ర ఆదివారం రేణిగుంటలో ప్రారంభమై శ్రీకాళహస్తి మీదుగా గూడూరు టవర్‌ క్లాక్‌ సెంటర్‌కు ఉదయం 11గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ బస్సు యాత్ర కు సీపీఎం ఆద్వర్యంలో ఘన స్వాగతం పలుకుతామని, అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. అధికారం కోసం వైసిపి , టీడీపి, జనసేన, బీజేపీలు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కొదిలేసి అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. సీపీఎం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా రక్షణ పేరు తో బస్సు యాత్ర చేపట్టిం దని తెలిపారు. ఈ బహిరంగ సభలో రైతు లు, కార్మికులు, మహిళలు, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు ని చ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య, పట్టణ కార్యదర్శి సురేష్‌ , బి చంద్రయ్య, పి మణి, కెవిపిఎస్‌ పట్టణ నాయకులు అడపాల ప్రసాద్‌ పాల్గొన్నారు.