Apr 24,2023 00:01

మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్‌

ప్రజాశక్తి-పాడేరు:కేంద్రంలోని బిజెపిని గద్దె దించుదాం- దేశాన్ని కాపాడుదాం అనే నినాదంతో సిపిఎం సిపిఐ పాడేరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రచార బేరి పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం పాడేరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాడేరు ఐటిడిఏ ముందు నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కమిటీ నాయకులు బాలేపల్లి వెంకటరమణ హాజరవుతున్నారని అల్లూరి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, గిరిజన కార్మిక వ్యతిరేక నిరంకుశమైన మతోన్మాద విధానాలతో ఆదివాసీల రక్షణకు బిజెపి ముప్పు కలిగిస్తుందన్నారు. గిరిజన చట్టాలను హక్కులను కాలరాస్తున్న బిజెపిపై జరిగే బహిరంగ సభను గిరిజన వర్గాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పాడేరు నియోజకవర్గంలో సీలేరు నుంచి ఈనెల 14న ప్రారంభించిన ఈ ప్రచార బేరి పాదయాత్ర జీకే వీధి కొయ్యూరు, చింతపల్లి, జిమాడుగుల, పాడేరు మండలాల్లో కొనసాగించినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, గిరిజన వర్సిటీ నిర్మాణం, వంటి విభజన హామీల అమల్లో చేసిన నిర్లక్ష్యంపై ప్రచార బేరి పాదయాత్రలో వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించామని తెలిపారు. అటవీ గిరిజన చట్టాలను బలహీనపరిచి సహజ సంపదలను దోచుకోవాలని కేంద్రం చూస్తోందన్నారు.అభివృద్ధి పేరిట చేస్తున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల్లోని ఆదివాసి వర్గాలన్నీ సర్వత్రా ఈ ప్రచారంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ బోయ/ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు సుముఖంగా ఉందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసి ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. టిడిపి, వైసీప,ీ బీజేపీ పార్టీలు అవకాశవాదంతో ఆదివాసీలను మోసగించేందుకు కుట్ర చేస్తున్నాయని వెల్లడించారు ఆదివాసీల హక్కుల రక్షణ కోసం ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపు నిచ్చామని తెలిపారు.
24న పాడేరు ఐటిడిఏ ముందు జరిగే సభకు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు బాలేపల్లి వెంకటరమణ. 25న అరకు వేలి లో జరిగే సభకు. సిపిఎం పోల్యూట్‌ బ్యూరో సభ్యులు. బీవీ రాఘవులు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి హాజరుకానున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పాడేరు చేరుకున్న పాదయాత్ర
పాడేరు:- కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, గిరిజన, కార్మిక, వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో ఈనెల 14 నుంచి సిలేరులో ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం సాయంత్రం పాడేరు చేరుకుంది. ఐదు మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటిస్తూ విజయవంతంగా పాదయాత్ర కొనసాగించి పాడేరు చేరుకున్న సిపిఎం, సిపిఐ శ్రేణులకు పాడేరు అంబేద్కర్‌ సెంటర్లో కార్యకర్తలు స్వాగతం పలికారు.