Nov 19,2023 21:18

ఫొటో : సమస్యలు తెలసుకుంటున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

నేడు మత్స్యకారుల సమావేశం
ప్రజాశక్తి-బిట్రగుంట : కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలను తమిళనాడు రాష్ట్రం మత్స్యకారులు నాశనం చేయడంపై సోమవారం జలదంకిలో మత్స్యకారుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంలో ఇతర రాష్ట్రాల మత్స్యకారులు, ఆంధ్ర రాష్ట్ర మత్స్యకారుల వలలను నాశనం చేయడం వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు నష్టాలకు గురవుతున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకొని పోగా ఆయన వెంటనే స్పందించి మత్స్యకారుల ఇబ్బందులు తొలగించేందుకు సముద్ర తీర ప్రాంతంలో గస్తీ తిరిగేందుకు పెద్ద బోటు ఏర్పాటు చేశాడని, సోమవారం జువ్వలదిన్నె గ్రామంలో ఉదయం 8గంటలకు పెద్ద బోటును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని మత్స్యకారులు, కాపులు, పెద్ద కాపులు, మండల కన్వీనర్లు, మత్స్యకార నాయకులు, వైసిపి నాయకులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, గృహ సారథులు, వాలంటరీలు, గ్రామస్తులు అందరూ పాల్గొంటారని తెలిపారు.