Feb 23,2023 22:29

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: ఆంధ్రా లయోలా కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి టెక్నోమీట్‌ - 2023 నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ కిషోర్‌ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌ నందు టెక్నోమీట్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధినీ, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే ఉద్దేశంతో తమ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం సైంటియా పేరుతో టెక్నోమీట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కళాశాల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌, క్విజ్‌, టాప్‌కోడి, సెర్చ్‌మీ, పోస్ట్‌మైవాల్‌, స్పాట్‌ ఫోటోగ్రఫీ, ఐయామ్‌ బిల్‌గేట్స్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సైంటియా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 50 కళాశాలల నుండి విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి నెహ్రూ, కో ఆర్డినేటర్‌ కె.అపర్ణ, పాల్గొన్నారు.