Aug 20,2023 22:47

ఫొటో : మాటాలడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగలి పుల్లయ్య

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి-ముత్తుకూరు : మండలంలోని కోళ్లమిట్ట గ్రామంలో సాగరమాల హైవే రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతుల సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌ ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగలి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ కలెక్టర్‌ కార్యాలయం వద్దకి రైతులందరూ రావాలని ఆయన కోరారు.
ఈ ప్రాంతంలో సాగరమాల హైవే రోడ్డుకి భూములు కోల్పోతున్న రైతులకి ఎకరాకి రూ.80 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు గడ్డం అంకయ్య, నక్క రాధయ్య, బ్రహ్మదేవి మోహన్‌ రావు, దుంపల ఏడుకొండలు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.