Dec 29,2022 18:27

పింఛన్లు రద్దు చేయడం దుర్మార్గం

ప్రజాశక్తి నెల్లూరు : మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించిన 5వేల మందికి 'మీ పింఛన్లను ఎందుకు రద్దు చేయకూడో చెప్పండి అంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం నగరంలోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల నోటీసులు తీసుకున్న పెన్షన్‌ దారులు తీవ్రమైన మానసిక సభకు గురవుతున్నారన్నారు. ఏళ్లతరబడి నుంచి తీసుకుంటున్న పింఛన్లను రద్దు చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఇప్పటికే సచివాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. నేడు సిపిఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాల యం ఎదుట పెన్షన్లను కోల్పోయిన లబ్ధిదారులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్ట నున్నట్లు తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరావు మాట్లాడుతు ప్రభుత్వ చర్యలతో పెన్షన్‌ ఆధారంగా జీవిస్తున్న అనేక మంది పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నగర నాయకులు పి. సూర్య నారాయణ, షేక్‌ మస్తాన్‌ బీ, ఆర్‌. శ్రీనివాసులు, కత్తి. పద్మ, సుబ్బమ్మ, రషీద్‌, ఫయాజ్‌, నక్కా వెంకటేశ్వర్లు, అమాన్‌, సంపూర్ణమ్మ పాల్గొన్నారు.