ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కివారిపాలెంలో బుధవారం కామ్రేడ్ గొర్రుముచ్చు లాజర్ సంస్మరణ సభ జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి జి సుధాకర్ తెలిపారు. సంస్మరణను పురస్కరిం చుకొని గ్రామంలో నిర్మించిన లాజర్ స్థూపాన్ని కూడా సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు ఆవిష్క రిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, బాపట్ల, గుంటూరు జిల్లాల పార్టీ కార్యదరులు సిహెచ్ గంగయ్య, పాశం రామారావు, ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు తదితర జిల్లా, మండల నాయకులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సంస్మరణ సభలో అందరూ పాల్గొనాలని కోరారు.










