గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఫారెస్టు లైన్‌లో వెలసిన భగవాన్ శ్రీజీహ్వేశ్వర జయంతి వేడుకల్లో స్వకుళ సాళి సమాజ్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి జిందే లక్ష్మణ్ కోరారు. సోమవారం అంబా భవాని దేవాలయం ఆవరణలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 5 గంటలకు విశేష పూజలు, అభిషేకాలు, బిల్వార్చనలతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. 12 గంటలకు మహా మంగళహారతితో పూజ కార్యక్రమం ముగుస్తుందన్నారు. అన్నదానం అనంతరం సాయంకాలం పురవీధుల గుండా శ్రీభగవాన్ జిహ్వేశ్వర ప్రతిమతో శోభాయాత్ర జరుగుతుందన్నారు.










