Jul 23,2021 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 5వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలను కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. పదో తరగతిలోని ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఫలితాలను విడుదల చేయనుంది. examsresults.ap.nic.in, aresults.bie.ap.gov.in, results.apcfss.in, bie.ap.gov.in లో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు.