
ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురంలో 109 మంది లబ్ధిదారులకు ఈనెల 17వ తేదీన ఇళ్ల స్థలాల పొజిషన్ చూపిస్తామని తహశీల్దార్ ఎవి.రమణారావు తెలిపారు. ఉంగుటూరులో 2.98 ఎకరాల్లో మెరక చేసిన లే అవుట్‌లో ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు సమక్షంలో లబ్ధిదారులకు స్థలాలను చూపిస్తామని తెలిపారు. వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేసుకునేలా చైతన్యం చేస్తున్నామని తహశీల్దార్ పేర్కొన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, విఆర్‌ఒ రమేష్‌లు సోమవారం స్థలాలకు మార్కింగు వేశారు.