Dec 16,2022 23:48

అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు సూరిబాబు

ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని పెద మాకవరం పంచాయితీ, గానుగుల, చింతపల్లి మండలం యర్రవరం ప్రాంతాల్లో నిర్మించనున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఈ నెల 17న శనివారం మండల బంద్‌ నిర్వహిస్తున్నట్లు అఖిల పక్ష పార్టీలు తెలిపాయి. శుక్రవారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల గిరిజనులు పంట పొలాలు, జీడి మామిడి తోటలు, ఇళ్లు, స్థిర, చరాస్తులు కోల్పోయి నిరాశ్రయులవుతారని తెలిపారు. ప్రజలు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు బంద్‌ను జయప్రదం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. వర్తక సంఘం, ఆటో, మోటార్‌ ఇలా అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు ఎస్‌.సూరిబాబు, జనసేన, టిడిపి, సిపిఐ, సిపిఎం ఎస్‌.బుజ్జిబాబు, జి.శ్రీనివాసు, సిహెచ్‌.ప్రసాద్‌, ఇ.దేముడు, జి.నూకరాజు, పి.చిన్నారావు, ఇ.బుజ్జిబాబు, వై.అప్పల నాయుడు పాల్గొన్నారు.