ప్రజాశక్తి-దరిశి: తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీలోని సోమవరప్పాడు సమీపాన ఉన్న గుంటిగంగ భవానీ అమ్మవారి తిరునాళ్ల నేడు వైభవంగా జరగనున్నది. గుడి చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారి ఆళ్ల భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 7 వైసిపి, 2 టిడిపి, 2 జనసేన పార్టీలు మండలంలోని పలు గ్రామాల నుంచి విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. శివరామపురం నుంచి 2 వైసిపి, కొత్తపాలెం వైసిపి 1, మాధవరం వైసిపి 1, రమణాలవారిపాలెం వైసిపి 1, తూర్పు గంగవరం వైసిపి 1, నాగంబొట్లపాలెం వైసిపి 1, శివరామపురం టిడిపి 1, లక్కవరం టిడిపి 1, తూర్పుగంగవరం జనసేన 1, విఠలాపురం జనసేన 1 విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. దరిశి డిఎస్‌పి వి నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సిఐ జె రామకోటయ్య పర్యవేక్షణలో తాళ్లూరు ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్, దరిశి ఎస్‌ఐ రామకృష్ణలతో పాటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి వారు భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.










