ప్రజాశక్తి -శ్రీకాకుళం: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు డయల్ యువర్ జెసి కార్యక్రమాన్ని ఈనెల మూడో తేదీన నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఫిర్యాదులు, సమస్యలు తెలియజేసే రైతులు 78933 00311 మొబైల్ నంబరుకు ఫోన్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను తక్షణమే పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










