నగర పోలీసు కమిషనర్
ప్రజాశక్తి - విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్.టి.ఆర్. జిల్లా ఇన్ చార్జ్ పోలీస్ కమీషనర్ జి.వి.జి.అశోక్ కుమార్ నేరుగా ప్రజలు మాట్లాడేందుకు శుక్రవారం ''డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమం'' శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించ బడుతుందని నగర పోలీసు కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0866-2490613 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలును నేరుగా పోలీస్ కమీషనర్‌కు తెలియచేసి పరిష్కరించుకోవాలని కోరారు. ఎన్.టి.ఆర్.జిల్లాలో జరిగే పోలీస్ సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు సమాచారం అందించాలనుకునే వారు సోషల్ మీడియా లింకులు ద్వారా చేయవచ్చని అన్నారు.










