ప్రజాశక్తి-పిఠాపురం, తాళ్లరేవు దళిత సమస్యల పరిష్కారం కోసం ఆదివారం కాకినాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర దళిత సదస్సును జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం పిలుపు ఇచ్చారు. శనివారం పట్టణంలోని స్థానిక జగ్గయ్య చెరువు ఎస్‌సి, ఎస్‌టి కాలనీలో సదస్సు కరపత్రాలను విస్తతంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కార్యదర్శి జిఎస్.భాస్కరాచార్యులు, నాయకులు పోశయ్య, పి.సింహాద్రి, ఐ.లోవరాజు పాల్గొన్నారు. తాళ్లరేవులో సిపిఎం మండల కమిటీ కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు సదస్సు విజయవంతానికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నేరేడుమిల్లి త్రిమూర్తులు, మందనక్క తణుకురాజు, బీర వెంకటేశ్వరరావు, కమిడి ఈశ్వరీబాయి, చల్లా సంతోష్ కుమార్, అత్తిలి బాబూరావు, గుత్తుల మల్లేశ్వరరావు, పి.రమేష్, వడ్డి ఏడుకొండలు, విప్పర్తి శ్రీనివాసరావు, పులుపకూర గోపాలకృష్ణ పాల్గొన్నారు.










