Nov 29,2022 22:05

         కొయ్యలగూడెం : సిఎం జగన్‌ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమ అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్‌ హాలు వద్ద టిడిపి మండల ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ రవీంద్రనాథ్‌ అధ్యక్షతన మండల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గంగిరెడ్ల మేఘాలా దేవి, రామారావు, చింతల వెంకటరమణ పాల్గొన్నారు. చింతలపూడి : ఈనెల 30వ తేదీన పట్టణంలో చంద్రబాబు పర్యటన, సభ ఏర్పాట్లను టిడిపి నాయకులతో కలిసి పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జోన్‌-2 పరిశీలకులు, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎంఎల్‌సి మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, ఏలూరు జిల్లా రైతు అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవ, ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్‌కుమార్‌, మాజీ ఎంపిటిసి కె.రాజారెడ్డి, నాయకులు తాటి అప్పారావు, అట్లూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు గుడిపూడి రవి, మారుమూడి థామస్‌, అచ్చాయమ్మా, ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈనెల 30న చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, టిడిపి నేత పీతల సూజాత అన్నారు. చింతలపూడి పట్టణంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు మాబూరి వెంకటరామయ్య, ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వైసిపి పాలనతో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉంగుటూరు : చంద్రబాబు పర్యటనలో భాగంగా ఈనెల 30న కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద ఘనస్వాగతం పలికేందుకు టిడిపి ఎస్సీ సెల్‌ విభాగం కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆపార్టీ మండల అధ్యక్షులు నేకూరి ఆశీర్వాదం అన్నారు. మంగళవారం నీలాద్రిపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తొలుత గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలదండలు వేశారు. కార్యక్రమంలో నీలాద్రిపురం గ్రామ అధ్యక్షులు రమేష్‌, నాయకులు సిహెచ్‌.కాంతారావు, బి.దుర్గారావు, పి.రాజారత్నం, డి.దిలీప్‌, డి.మురళీ పాల్గొన్నారు.