ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు వంశధార-నాగావళి నదుల అనుసంధానం కోసం నిర్మాణంలో ఉన్న హైలెవల్ కెనాల్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశధార నదిపై గొట్టాబ్యారేజీని సందర్శిస్తారు. మద్యాహ్నం1గంటనుంచి 1.30 వరకు రిజర్వు కాగా అనంతరం 2గంటల వరకు వంశధార ప్రాజక్టును పరిశీలిస్తారు. 2.30 గంటలకు కొత్తూరు మండలం గూనభద్రలోని శ్రీ లక్ష్మీరాజా ఫంక్షన్ హాల్‌లో 2.20 నుంచి 3.30 గంటల వరకు సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఐదు నుంచి ఆరు గంటల వరకు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం సీతంపేట, పాలకొండ, ఆమదాలవలస బైపాస్ మీదుగా శ్రీకాకుళం జాతీయ రహదారికి చేరుకుని రోడ్డు మార్గాన రాత్రి 9గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.










