నేడు చలో విజయవాడ
- మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ ఇస్తున్న కార్మికులు
ప్రజాశక్తి-కావలి రూరల్ : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కు అర్జీని అందజేశారు. ఈ మేరకు గురువారం సిఐటియు కార్మికులు పనులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, డైలీ కార్మికులను అవుట్‌సోర్సింగ్‌లో చేర్చాలని, క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 వేతనం ఇవ్వాలని ఇంకా అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.కిష్టయ్య, యూనియన్ నాయకులు తురక సీనయ్య, జలదంకి బాబు, కె.శివకోటయ్య, తదితరులు పాల్గొన్నారు.










