Sep 28,2023 22:13

నేడు ఐదో విడత 'వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర' విడుదల
6,482 మందికి రూ.6,48,20,000 లబ్ధి
కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కార్యక్రమం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 5వ ఏడాది నిధులు విడుదల 29వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదో విడత వాహనమిత్ర పథకం ద్వారా జిల్లాలోని 6, 482 మంది ఆటో, ట్యాక్సి, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.6,48,20,000 ప్రభుత్వం నుండీ విడుదల కానుంది. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే వాహన మిత్ర కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, పెద్డిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆర్‌కే రోజాలతో పాటు ఎంఎల్‌ఏలు పాల్గొనున్నారు.
నేడు ఐదో విడత వాహన మిత్ర నిధులు విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఇస్యూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌, మరమత్తులు చేసుకొనేలా ప్రయివేటు డ్రైవర్లను ఆదుకొనేలా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈపథకం క్రింద అర్హులైన ప్రతిఒక్కరికీ ఏటా రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ ఏడాది ఐదో విడత వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం క్రింద జిల్లాలోని 6,482 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.6,48,20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. స్వంత వాహనం కలిగిన డ్రైవర్లకు మాత్రమే వాహనమిత్ర పథకం వర్తిస్తుందనే నిబంధన ప్రభుత్వం పెట్టడంతో అద్దె ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వం నుండీ ఎలాంటి లబ్ది పొందలేకపోతున్నారు. స్వంత వాహనాలనే నిబంధన తొలగించి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని డ్రైవర్లు కొరుతున్నారు.
ఐదేళ్ళలో ఇలా....
సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్క్రెవర్‌లకు ఇన్సూరెన్స్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌, మరమ్మతులు ఇతర అవసరాల నిమిత్తం ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఐదు విడతల్లో అంటే ఐదో విడత వాహన మిత్ర నిధులతో కలిపి జిల్లాలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం క్రిందమొత్తం 31,184మంది రూ.31,18,40,000లను రాష్ట్రప్రభుత్వం అందజేసింది. 2019 -20లో 5,879 మందికి రూ. 5,87,90,000, 2020- 21లో 6,674 మందికి రూ.6,67,40,000, 2021- 22లో 6,105 మందికి రూ.6,10,50,000, 2022- 23లో 6,044 మందికి రూ.6,04,40,000, 2023- 24లో 6,482 మందికి రూ.6,48,20,000 ఈ పథకం క్రింద ఆటో, మ్యాక్సీ, క్యాబ్‌ స్వంత వాహనాలున్న డైవర్లు లబ్దిపొందారు. ఐదో విడత వాహన మిత్ర పథకం క్రింద రూ. 10వేలు అందించే కార్యక్రమం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రుల చేతులమీదుగా ప్రారంభించనున్నారు.