ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: యాంత్రిక జీవితానికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది ఒక్క నడక మాత్రమేనని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు 102 మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పి.జి.గుప్తాలు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ఖర్చు లేకుండా నడక మాత్రమే వ్యాయామానికి తోడ్పడుతోందని అన్నారు. అనేక రోగాలు నడక ద్వారా మటుమాయం అవుతాయన్నారు. ఉద్యాన వనశాఖ ఎడి ఆర్.వి.ప్రసాద్ మాట్లాడుతూ రోజూ గంట సేపు నడిస్తే శరీరంలోని కొవ్వు కరిగి రక్తపోటును క్రమబద్దీకరించుకోవచ్చనని అన్నారు. అనంతరం 2025 సంవత్సరానికి కొత్త గవర్నర్ ఎంపిక కోసం క్లబ్‌ల అభిప్రాయాలను సేకరించారు. వాకర్స్ బి.వి.రవిశంకర్, బి.దేవీప్రసాద్, డాక్టర్ జి.నారాయణరావు కొంక్యాన మురళీధరరావు, నాగేశ్వరరావు, బి.జగదేశ్వరరావు, ఐ.కె.రావు, ఎన్.ఈశ్వరరావు, జి.సత్యనారాయణ గొర్లె వాసుదేవరావు, డాక్టర్ గజల్స్ వాసుదేవ్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించే వాకర్‌ను సన్మానించారు.










