Oct 20,2022 23:33

రోడ్డు మధ్యలో హంగామా చేస్తున్న సన్నీ

ప్రజాశక్తి- పెందుర్తి: అధికార వైసిపి నేత, మార్కెట్‌ కమిటీ సభ్యురాలి భర్త సన్నీ మద్యం మత్తులో గురువారం నడిరోడ్డుపై వీరంగం సష్టించారు. 97వ వార్డు సుజాతనగర్‌ కూడలిలో వైసిపి జెండా పట్టుకుని, అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో కూర్చుని, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తూ అలజడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారించినా ససేమిరా అంటూ అక్కడే కూర్చోవడంతో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కాగా గతంలోనూ వైసిపి సమావేశంలో సన్నీ నానా హంగామా చేశాడు. అప్పట్లో ఎమ్మెల్యే అదీప్‌రాజుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి వార్తల్లో నిలిచారు. సన్నీ వ్యవహారశైలిపై స్థానికులు మండిపడుతున్నారు.