ఆలోచనలు స్పష్టం అయ్యేలా
మనస్సు తేలికపడేలా
మాటలు ఆడేందుకు...
వైఫల్యాల ఎదురుదెబ్బలకు
జీవితం చల్లబడిపోతే
గొయ్యి తీసి పాతిపెట్టకుండా
గోరువెచ్చని ధైర్యం ఇచ్చేందుకు...
ఒకరు కావాలి
గుండెను కన్నుచేసుకుని
మనసుతో ఆలకించేందుకు...
నవ్వుగా వెలుగుతున్నప్పుడు
నవ్వులపాలు కాకుండా చూసే
ఏడుపు ముసురేవేళ
విచారానికి సాయమొచ్చే
ఒకరు కావాలి
నీ వాళ్ల గురించి
తపస్సు చేయటంలో పడి
నిన్ను నువ్వు మర్చిపోతున్నావని
గుర్తుచేసేందుకు...
పాతబడిపోతూ
ముగింపులోకి జారుతున్నప్పుడు
అప్పుడప్పుడైనా
కాస్త తాజాతనం జల్లేందుకు...
ఒకరు కావాలి
కళ్ళేపల్లి తిరుమలరావు
91770 74280