Aug 28,2023 00:25

ప్రజాశక్తి-తాడేపల్లి : బాలల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకే మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నన్లు బాలోత్సవాల రాష్ట్ర కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ తెలిపారు. తాడేపల్లి పట్టణంలోని అమరావతి ఐకాన్‌లో ఆదివారం ఎంటిఎంసి బాలోత్సవం ఆధ్వర్యంలో గణితంలో ప్రాథమిక అంశాలపై అవగాహన క్లాసును గణితంలో నిష్ణాతులైన లెక్చరర్‌ ఎస్‌.లెనిన్‌బాబు బోధించారు. అపార్టుమెంట్స్‌, వివిధ పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించిన తరగతుల ముగింపు సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడారు. మాస్టర్‌ లెనిన్‌ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోర్డుపై థియరీ చేసి చూపించిన తీరు బాగుందన్నారు. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున బాలోత్సవాలు, ఉగాది బాలోత్సవం, స్పోకెన్‌ ఇంగ్లీషు శిక్షణా తరగతులు, చిత్రలేఖనం పోటీలు, మ్యాజిక్‌ శిక్షణ జయప్రదం కావడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే మంచి సంకల్పంతో ముందు కొస్తున్న వారి సేవలు వినియోగించు కోవాలని కోరారు. ప్రస్తుతం కుటుంబ బంధాలు, స్నేహ భావాలు కుచించుకుపో తున్నాjని, పెద్దవారికి, సాటి వారికి సేవ చేయాలనే భావన సమాజంలో కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబాల్లో పిల్లలు ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవా ల్సింది ఎంతో ఉందని చెప్పారు. పిల్లలు ఒత్తిడితో కష్టపడి కాకుండా ఇష్టపడి చదివే వాతావరణం రావాలని కోరారు. మాస్టర లెనిన్‌బాబు మాట్లాడుతూ ముందు లెక్కలంటే భయం విడనాడాలన్నారు. చేయగలమనే ధైర్యంతో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏమీ లేదని చెప్పారు. అవగాహన చేసుకుంటే లెక్కలు తేలికగా చేయవచ్చన్నారు. లెక్కలపై మరింత అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ అవకాశాన్ని పిల్లలు వినియోగించుకోవాలని సూచిం చారు. మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ పిల్లలు తమ ఏకాగ్రతను చదువుపై పూర్తిగా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని చెప్పారు. కార్యక్ర మంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు యడ్ల బాలకృష్ణ, షితిజ, గౌతమి, పి.సుధారాణి, శ్రీలక్ష్మి, గుప్తా, సిహెచ్‌. వెంకటరావు, చంద్రలేఖ పాల్గొన్నారు.