నియామక పత్రాలను అందజేస్తున్న ట్రిపుల్ ఐటి డైరెక్టర్
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: నైపుణ్యాధారిత విద్యపై దృష్టి సారించాలని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ పి.జగదీశ్వరరావు సూచించారు. మండలంలోని ఎస్‌ఎంపురంలో గల ట్రిపుల్ ఐటిలో పియుసి పూర్తి చేసిన విద్యార్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్‌కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, డిఎస్‌డబ్ల్యు రవి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










