Sep 02,2022 23:15

స్కై లార్క్‌ సంస్థ నూతన బ్రాంచ్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి- పెందుర్తి : నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందుకే దీనికి అవసరమైన శిక్షణ పొందాలని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సూచించారు. శుక్రవారం పెందుర్తిలో స్కైలార్క్‌ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సిఇఒ రాజేశ్వరరావు మాట్లాడుతూ, తక్కువ రుసుముతో వివిధ రగాల్లో యువత శిక్షణనివ్వడమే స్కైలార్క్‌ సంస్థ ఉద్దేశ్యమన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లు ప్రతాప్‌, అశోక్‌ మాట్లాడుతూ, కాకినాడలో తమ సంస్థ ప్రారంభించిన పదేళ్లలో అనేక మందికి నైపుణ్యశిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిదన్నారు. అన్‌లైన్‌ మార్కెటింగ్‌లో హోమ్‌ నీడ్స్‌, కాస్మొటిక్స్‌, గార్మెంట్స్‌ తదితర అంశాలపై శిక్షణనిస్తామన్నారు. కార్యక్రమంలో శరగడం చిన అప్పలనాయుడు, డిఆర్‌సి మాల్‌ అధినేత దాడిశెట్టి రమణ, కార్పొరేటర్‌ ముమ్మన దేముడు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ దేవి సాంబ, ఎంపిపి ముదపాడ నాగమణి, పెందుర్తి సిఐ వెంకునాయుడు పాల్గొన్నారు.