- జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం: జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రచారాన్ని కల్పించి తద్వారా పర్యాటక ప్రదేశాన్ని తీసుకొచ్చేందుకు, పిల్లల నైపుణ్యం, పరిశుభ్రత, వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు యువ పర్యాటక క్లబ్‌లు దోహదపడతాయని పర్యాటక జిల్లా అధికారి ఎన్.నారాయణరావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో యువక్లబ్ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కలెక్టర్, పర్యాటకశాఖ కమిషనర్ ఆదేశాలననుసరించి ఈ యువ క్లబ్బులను ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతిఒక్కరూ మన పండగలు, జాతరలు, కళారుపాలపై ప్రస్తుతం యువతకు, భావితరాల వారికి తెలియజేయాలంటే నేటి యువత వాటిపై డాక్యూమెంట్ తీసి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యువ క్లబ్‌ల వల్ల విద్యార్థులకు నైపుణ్యం పెంపొందుతుందన్నారు. యువ క్లబ్‌ల ఆవశ్యకత వివరించారు. జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల ప్రముఖ్యత వివరించారు. డాక్టర్ గీతాశ్రీకాంత్ ముట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో వివిధ పర్యటిక ప్రదేశాలను పర్యటించి వీడియోగ్రఫీ చేసి, పొటోలు జతచేసి వాటి చరిత్రను తెలుసుకొని పలువురికి తెలియజేయాలన్నారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటి చరిత్ర ఫొటోలను జతపరిచి ఒక డాక్యూమెంట్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రాధానోపాధ్యాయులు వాగ్దేవి, సహాయ పర్యాటక అధికారి డి.రమేష్, వసంత పాల్గొన్నారు.










