మా బతుకుల్లో వెలుగులు నింపేందుకు
తాను వలసపక్షై రక్తాన్ని దారవోస్తూ
దూరాలని సైకిల్‌పై చేదిస్తూ
సద్దిబువ్వనే పరమాన్నంగా భుజించే
మానాయిన దేవుడు గాక ఏమగును....
తనజీవితాన్ని అజ్ఞానాంధకారాలు అలుముకున్నా..
మమ్ములను విజ్ఞానఘనులుగా మార్చిన
మితభాషి మాశ్రేయస్సుగోరే శ్రేయోభిలాషి
మానాయిన దేవుడు గాక ఏమగును...
కరువులు కోరలు జాచిన
మా తనువుల రక్షణకే తంటాలుపడుతూ
మా కంటిలో కన్నీళ్ళు రానీయక
తన కంటిలోని నీళ్ళు మాకంటవడకుండ
మా వ్యథను ఒంపుకున్న అక్షయపాత్ర తను
మరి మానాయిన దేవుడు గాక ఏమగును..
ఎండనక వాననక
రాత్రనక పగలనక
రాయిని మలిచి గుడిగట్టి
దేవునికే నీడనిచ్చే..
మా తలరాతలను మార్చిన
మానాయిన దేవుడు గాక ఏమగును....
మేట్నాతో మేడలు గడుతూ
హలంతో పొలం దున్నుతూ
ప్రతిఫలం అశించక
నిత్యం ప్రవహించే జీవనది అతడు..
బడిని గుడిని గట్టినా గరీబ్
ఒంటికాలుపై తపస్సునిజేసిన
భగీరథుడి వారసుడు...
బతుకు సమరంలో ఓటమిపై
విజయపతాకాన్ని ఎగరవేస్తూ...
మాబతుకుల్లో వెలుగులు నింపి
మా తలరాతలను రాసిన
నిజబ్రహ్మ మానాయిన
- ఉప్పరి తిరుమలేష్
96189 61384