Mar 05,2023 23:14

కుటుంబీకులతో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు

ప్రజాశక్తి- జి.మడుగుల: కంఠవరం జలపాత వద్ద మత్స్య మడుగులమ్మ నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సమావేశం ఆదివారం జరిగింది. మండల మత్స్యమడుగులమ్మ నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన అధ్యక్షుడిగా కాతా మాధవరావు, కోశాధికారిగా బైలుపూడి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం బలోపేతం చేయడానికి, సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు మాధవరావు అన్నారు. ఈ సమావేశంలో మండలంలో పలు ప్రాంతాల నుండి నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.