
నాటు సారా క్యాన్లును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసు అధికారులు
పార్వతీపురంరూరల్: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఒడిషా రాష్ట్రం నుండి అక్రమంగా నాటు సారా రవాణా చేస్తున్నారన్న సమచారం మేరకు మండలంలోని ఎంఆర్ నగరం సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని 120 లీటర్ల నాటు సారాను సీజ్ చేశారు. బాలగుడబకు చెందిన బంగారి రాజశేఖర్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. అలాగే పార్వతీపురం మున్సిపాల్టీ శివారులో గల నవిరికాలనీ వద్ద నాటు సారా అమ్ముతున్న మీసాల రవిపై కేసు నమోదు చేసి 200 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర, ఎస్‌ఐ రమణ,సిబ్బంది పాల్గొన్నారు.