
పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటుబాంబులు బకెట్
నాటు బాంబులు స్వాధీనం
ప్రజాశక్తి - పగిడ్యాల
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వనములపాడు గ్రామంలో ఐదు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూర్ రూరల్ సిఐ విజరు భాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై నాగార్జున సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో దొరికిన బాంబుల కేసులో ముద్దాయిగా ఉన్న ముచ్చుమర్రి గ్రామానికి చెందిన డబ్బా వెంకట స్వామిని విచారించగా వనములపాడు గ్రామంలోని అన్నపూర్ణమ్మ దేవాలయం సమీపాన బకెట్‌లో ఐదు బాంబులు ఉన్నాయని చెప్పాడన్నారు. జాగిలాలను పిలిపించి సోదాలు చేయగా 5 నాటు బాంబులు దొరికాయని తెలిపారు. గతంలో 26, ప్రస్తుతం 5 దొరకడంతో మొత్తం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 31 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.