
* డ్వామా పీడీ చిట్టిరాజు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి : ఉపాధి హామీ ద్వారా రోడ్లకు ఇరువైపులా, చెరువుగట్లపై, రైతుల పొలాల్లో నాటే ప్రతి మొక్కను బతికించుకోవాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల ఉపాధి హామీ సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించే విధంగా పనులు గుర్తించి నివేదికలు తయారు చేయాలన్నారు. గ్రామంలో కమ్యూనిటీ సోప్‌పిట్లు, గ్రామ సచివాలయాలు, పాఠశాలలల్లో రూప్‌టాప్ తదితర వాటిని గుర్తించి ప్రతిపాదనలు చేయాలన్నారు. ఇప్పటికే మంజూరైన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో హెచ్‌ఆర్ మేనేజర్ పి.శ్రావణ్ కుమార్, ఎపిఒలు బి.వాసునాయుడు, అరుణ్‌కుమార్, జిఇలు జి.హరిప్రసాద్, మునేంద్ర, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.