Jul 02,2023 21:22

నాసిరకంగా రాజీవ్‌పార్క్‌పనులు

!రాజీవ్‌పార్క్‌ పనుల నాణ్యతపై సందేహం కలుగుతోంది. పార్కు వెలుపలి ప్రాంతంలోని ప్రహరీ నిర్మాణ పనుల తీరును చూస్తే అవు ననే సమాధానం లభిస్తోంది. కడప నగర ప్రజానీకం సేద తీరడానికి ఉద్దేశించిన రాజీవ్‌పార్క్‌ పనులపై నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల కిందటి నుంచి సాగు తున్న పనుల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. రెండ్రోజుల్లో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సమాయత్త మవుతున్న ఉరుకులు పరుగులు మీద నిర్మాణ పనులు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
కడపలోని రాజీవ్‌పార్క్‌ పనులు ఆగమేఘాల మీద సాగుతున్నా యి. 2021 జులైలో రూ.1.37 కోట్లతో పార్క్‌ నిర్మాణ పనులు, రూ. 5.6 కోట్లతో రాజీవ్‌మార్గ్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 2021 జులై ఐదున వెంకటేశ్వర కాంట్రాక్ట్‌ ఏజెన్సీ టెండరు దక్కించుకుని పనులు చేపట్టింది. అగ్రిమెంట్‌ దశ నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీటితోపాటు ఎలక్ట్రిఫికేషన్‌, ఓఎటి, ప్లాంటే షన్‌ వంటి ఐదు రకాల అనుబంధ పనుల్ని జత కలపడంతో గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్‌ కుదిరిన అనంతరం కాంట్రా క్టర్‌ ఆగమేఘాల మీద పనులు చేపట్టారు. కొంతకాలం పనులు చేప ట్టిన అనంతరం బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో పనుల్ని నిలిపి వే శారు. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముతున్న నేపథ్యంలో జి ల్లా రాజకీయ నాయకత్వం రాజీవ్‌మార్గ్‌ నిర్మాణ పనులు పూర్తి చేయ డంపై దృష్టి సారించింది. దీంతో రాజీవ్‌మార్గ్‌, పార్క్‌ పనుల్లో కదలిక కనిపించింది. ఈనేపథ్యంలో రాజీవ్‌పార్కు, మార్గ్‌ పనులు ఊపందు కున్నాయి. ఈనెల ఐదున రాజీవ్‌మార్గ్‌, పార్క్‌ పనుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంబోత్సవం చేయను న్న నేపథ్యంలో కార్పొరేషన్‌ యంత్రాంగం దృష్టి సారించింది. ఏడా దిన్నర కిందటి నుంచి రాజీవ్‌పార్క్‌ దిగువ ప్రాంతంలోని ప్రహరీ పాత పునాధులపైనే దర్శనమిస్తోంది. అటువంటి పాత బేస్‌మట్టం పైనే నిర్మాణ పనుల్ని పూర్తి చేయడం విస్మయాన్ని కలిగించింది. పాత బేస్‌మట్టపు రాళ్లు కదిలిపోయినప్పటికీ గమనిం చకపోవడం, విస్మ రించడం పార్క్‌ పనుల నాణ్యతపై సందేహాల్ని రేకెత్తిస్తోంది. బాహా టంగా బయటికి కనిపించే బేస్‌మట్టపు పనుల్ని సరి చేయని నేపథ్యంలో రాజీవ్‌మార్గ్‌, పార్క్‌ అదనపు విభా గాల పనుల అంతర్గత నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటాయోననే విషయంలో సందేహం కలుగుతోంది. రాజీవ్‌పార్క్‌ ప్రహరీ నాసిరకపు పనుల గురించి నగర పాలక సంస్థ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రత్నమరాజును సం ప్రది ంచగా ప్రహరీ పనుల్ని ప్లాస్టింగ్‌ పనులతో కలిపి పూర్తి చేస్తామని పేర్కొనడం గమనార్హం.నాసిరకంగా ఉన్నప్రహరీ నిర్మాణం