Jun 21,2023 19:18

గుమ్మనూరు నుంచి పెంచలపాడు రోడ్డు పనులను పరిశీలిస్తున్న క్వాలిటీ అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
పంచాయతీ రాజ్‌ రోడ్డు పనుల్లో నాసిరకం పనులు చేపడితే సహించబోనని పంచాయతీ రాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ డిఇ ఈరన్న కాంటాక్ట్‌దారులకు హెచ్చరించారు. బుధవారం రూ.5 కోట్ల నిధులతో చేపట్టిన పెంచలపాడు నుంచి గుమ్మనూరు రోడ్డు పనులను పంచాయతీరాజ్‌ ఎఇ సోలారెడ్డి ఆధ్వర్యంలో క్వాలిటీ కంట్రోల్‌ డిఇ ఈరన్న, ఎఇ ముక్తార్‌ బాష పరిశీలించారు. ఈ సందర్భంగా డిఇ మాట్లాడారు. రోడ్డు పనుల్లో నాణ్యత ఉండాలని, పది కాలాలపాటు రోడ్డు చెక్కుచెదరకూడదని చెప్పారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు రోడ్డు పనులు ముగించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను కోరారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సూరి పాల్గొన్నారు.