Nov 18,2023 00:18

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
అమెరికాలో ప్రతిష్టాత్మకమైన నాసా సంస్థ నిర్వహించే నాసా స్పేస్ సెటిల్మెంట్ పోటీలకు ప్రాజెక్ట్ తయారు చేయడానికి 18మంది శ్రీచైతన్య  విద్యార్థులను ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రాజెక్ట్ తయారీకి ఎంపికైన విద్యార్థులకు పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొండెపు ఆదినారాయణ, షేక్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాసా కిట్లు అందజేశారు. విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎజిఎం ఎం అంజయ్య, ఆర్ఐ జి అప్పాజీ, కో ఆర్డినేటర్ కె శ్రీనివాసరావు, డీన్ వై సీతయ్య, శేషగిరిరావు, గీత, సునీత పాల్గొన్నారు.