ప్రజాశక్తి - భీమడోలు
అమెరికా దేశానికి చెందిన నాసా స్పేస్ సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల స్థాయిలో నిర్వహించిన పోటీలలో శ్రీచైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని పొందారు. భారతదేశం నుంచి పాల్గొన్న 54 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు, పోటీలలో పాల్గొన్న శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారన్నారని ప్రిన్సిపల్ డి.సోహిని తెలిపారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో 'జనవాసాలకు అవకాశం గల గృహాలపై జీవనం' అనే అంశంపై నాసా స్పేస్ సెటిల్‌మెంట్ ప్రోగ్రాం 2022-23 పోటీలను నిర్వహించారన్నారు. సదరు పోటీలలో పాల్గొన్న 12 మంది విద్యార్థులు సంయుక్తంగా సమర్పించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కిందని ప్రిన్సిపల్ తెలిపారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రాజెక్టులో పాల్గొన్న 12 మంది విద్యార్థులకు నాసా బహుకరించిన సర్టిఫికెట్లు, బహుమతులను ప్రిన్సిపల్ వారికి అందజేసి అభినందించారు.










