మాట్లాడుతున్న డాక్టర్లు
నారాయణలో ప్రత్యేక వైద్యశిబిరం
ప్రజాశక్తి-నెల్లూరు:నారాయణ వైద్యశాలల్లో ఈ నెల 4,5 తేదిలల్లో మొటిమలు, మచ్చలకు ప్రత్యేక చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ వైద్యశాల మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ బి.హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక చింతారెడ్డిపాళెం ప్రాంతంలోని నారాయణ వైద్యశాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వైద్యశాలలోని ఐదవ అంతస్తులో చర్మవ్యాధుల విభాగంలో రెండు రోజుల పాటు ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉంటాయని,మొటిమలు, మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, గుంటల సమస్యలతో బాధపడే వారు ఈ శిబిరంలో పాల్గొని తగిన సలహాలు, సూచనలు , వైద్యం పొందగలరన్నారు.ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తోపాటు అవసరమైన సిబిపి, ఆర్‌బిఎస్, టిఎస్‌హెచ్ రక్తపరీక్షలు ఉచితంగా చేస్తామని తెలిపారు. అలాగే లిపిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ అబ్జామిన్ స్కాన్ పరీక్షల పై 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని, కెమికల్ పీల్స్ చికిత్సలకు 25 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తెలిపారు.నారాయణ హాస్పిటల్ చర్మ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఎ. విజయమోహన్ రావు మాట్లాడుతూ మొటిమలు, మచ్చలు గుంటలు సమస్యలు ఎందుకు వస్తాయో వివరించారు. డాక్టర్ ఉదరు కిరణ్ మాట్లాడుతూ ఈ మొటిమలు నాలుగు దశలుగా ఉంటయని, అవి ముఖం, వీపు,ఛాతి, భుజాలు వంటి ప్రదేశాలలో వస్తాయని, వాటి తీవ్రత ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియజేశారు. డాక్టర్ యాస్మిన్ షేక్ మాట్లాడుతూ ఈ మొటిమలకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి అనే విషయాలను క్షణంగా వివరించారు.అనంతరం డావ షేక్ షబానా గారు మాట్లాడుతూ మొటిమలకు నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉ న్న వైద్య చికిత్సల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. అరుణ్‌కాంత్,ఏజిఎం ఏసి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు నారాయణ వైద్యశాల చర్మవిభాగానికి చెందిన 9640100555/7331170063 ఫోన్‌నెంబర్లను సంప్రదించాలన్నారు.










