ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్ : పట్టణంలో నారాయణ విద్యాసంస్థల్లో పుస్తకాలు అధిక రేట్లు అమ్ముతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు అందిన సమాచారం మేరకు సోమవారం అక్కడికి చేరుకొని జిల్లా విద్యా శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలను పరిశీలించిన అధికారులు.. పుస్తకాల గదిని సీజ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోట సాయికుమార్, ఎస్.రాజు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ముద్రించిన పుస్తకాలు కాకుండా వారు ముద్రించిన పుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవన్నారు. ఇప్పటికైనా స్పందించి సీజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు నవిత, రమా, అమూల్య, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతిష్, సిద్దు, రాఘవ పాల్గొన్నారు.










